పిడుగురాళ్లలో భారీ చోరీ
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

పిడుగురాళ్లలో భారీ చోరీ

పిడుగురాళ్ల: పట్టణంలోని ఓ వ్యాపారి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు 25 సవర్ల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు చోరీ చేసినట్లు పిడుగురాళ్ల పట్టణ సీఐ కె.ప్రభాకరరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలో సైదా బజారుకు చెందిన ఆతుకూరి పూర్ణచంద్రరావు తన మామయ్యకు ఆరోగ్యం బాగోక గుంటూరు ఆసుపత్రిలో చేరారు. ఆయన్ని చూడటానికి కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి గుంటూరు వెళ్లారు. గురువారం గుంటూరు నుంచి ఇంటికి వచ్చినవారు తాళం తీసి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా, బీరువా తాళాలు పగులగొట్టి 25 సవర్ల బంగారపు ఆభరణాలు, 15 కిలోలు వెండి వస్తువులు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని