రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి
eenadu telugu news
Updated : 22/10/2021 06:47 IST

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి

ఏడుకొండలు మృతదేహం

అంగలూరు(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పేరం ఏడుకొండలు(56) గుడివాడ ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పని చేస్తున్నారు. యథావిధిగా బుధవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి బయలు దేరారు. అంగలూరు దాటి కవిరాజ్‌నగర్‌ సమీపంలో రోడ్డు మార్జిన్‌ దాటి పక్కన పడిపోయి తలకు తీవ్రగాయాలతో ఉన్న అతడ్ని స్థానికులు గుర్తించి 108కు సమాచారం ఇవ్వగా వారొచ్చి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏఎస్‌ఐ పార్థసారథి కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని