నరకానికి నకళ్లు
eenadu telugu news
Published : 22/10/2021 05:57 IST

నరకానికి నకళ్లు

మొవ్వ నుంచి కొండవరం మీదుగా పెదముత్తేవి వెళ్లే రహదారి దుస్థితి

మొవ్వ(కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ మండలం పెదముత్తేవి వెళ్లే ప్రధాన రహదారుల దుస్థితి వర్ణనాతీతంగా మారాయి. మొవ్వ నుంచి కొండవరం మీదుగా పెదముత్తేవి వెళ్లే మార్గం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా తయారైంది. మూడేళ్ల కిందట రహదారి అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో గుత్తేదారు రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించి ఒక లేయర్‌ గ్రావెల్‌ పోశారు. ఆ నిధులు మంజూరవ్వకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపి వేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. అయ్యంకి నుంచి కారకంపాడు అడ్డరోడ్డు మీదుగా పెదముత్తేవి వెళ్లాలంటే ప్రయాణం నరకప్రాయమే. అడుగడుగునా పెద్ద అగాధాలు పడ్డాయి. ద్విచక్ర వాహనచోదకులు తరచూ ప్రమాదాల బారిన పడి గాయపడుతున్నారు. ఇప్పటికైనా ఆధ్యాత్మిక గ్రామమైన పెదముత్తేవి గ్రామానికి చేరే ప్రధాన మార్గాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని