పెళ్లి కొడుకు అదృశ్యం
eenadu telugu news
Published : 22/10/2021 06:07 IST

పెళ్లి కొడుకు అదృశ్యం

కానూరు, న్యూస్‌టుడే: మరో రెండు గంటల్లో ముహూర్తం ఉందనగా పెళ్లి కుమారుడు అదృశ్యమైన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన దాసరి అనిల్‌, ఓ యువతి అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేజర్లే. పెద్దలను ఒప్పించుకుని వివాహానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 11 గంటలకు పెళ్లి కుమారుడు ఇంట్లో వివాహం చేయడానికి నిశ్చయించుకున్నారు. బుధవారం పెళ్లికుమార్తె ఇంట్లో ప్రదానం నిర్వహించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి పెళ్లి కుమారుడు కనపడకపోవటంతో అందరూ వెతకడం ప్రారంభించారు. ఇంకా వస్తాడని సాయంత్రం వరకు ఎదురు చూశారు. ఎంత సేపటికి రాకపోయేసరికి పారిపోయాడన్న అనుమానంతో పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కుమారుడి వైఖరిపై వధువు తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని