ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కేసులు
eenadu telugu news
Published : 22/10/2021 06:07 IST

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కేసులు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : కర్ఫ్యూ ఆంక్షలు, 144 సెక్షన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద 4 కేసులు నమోదు చేశారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతూ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన 1,691 మంది వాహన చోదకులకు చలానాలు రాసి, రూ.4,08,345లు జరిమానా విధించారు. మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 201 మందిపై కేసులు పెట్టి, రూ.24,120లు జరిమానా విధించారు. కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడిన 20 మందిపై 17 కేసులు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని