438 వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
eenadu telugu news
Updated : 23/10/2021 06:43 IST

438 వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

కలెక్టరేట్‌: గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 438 వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు  జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌.కేశవరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో  https://gswsvolunteer.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను 29న పరిశీలిస్తారని, 30, 31న మౌఖిక పరీక్షలను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరుగుతాయన్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని