‘పట్టాభి వ్యాఖ్యలను అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి’
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

‘పట్టాభి వ్యాఖ్యలను అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి’

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబునాయుడి పెయిడ్‌ ఆర్టిస్ట్‌ పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు పేర్కొన్నారు. నగరంలోని పాత పోలీస్‌ కంట్రోల్‌రూం కూడలిలోని వైఎస్సార్‌ పార్కులో జనాగ్రహ నిరసన దీక్ష ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి పట్టాభితో ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం వరకు చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైకాపా చేపట్టిన జనాగ్రహ దీక్షలను భగ్నం చేసేందుకు చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా వాటిని వైకాపా ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు జగనన్న ప్రభుత్వం పెద్దపీˆట వేస్తుంటే ప్రతిపక్షనేత భరించలేకపోతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, దేవినేని అవినాష్‌, గౌతంరెడ్డి, ఉప్పాల హారిక, అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని