పోలీసులకు చిక్కిన పెళ్లికొడుకు
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

పోలీసులకు చిక్కిన పెళ్లికొడుకు

పెనమలూరు, న్యూస్‌టుడే: పరారయిన పెళ్లికొడుకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన అనిల్‌కు ఓ యువతితో గురువారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తానికి గంట ముందే అతను ఇంటి నుంచి జారుకున్నాడు. గుట్టుగా గోడదూకిన అతను ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు పరారయినట్లు గుర్తించారు. ఈలోగా పెళ్లికుమార్తె బంధువులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీంతో అనిల్‌ తిరిగి ఇంటికి బయల్దేరాడు. పోలీసులు అతని సెల్‌ఫోన్‌పై నిఘా పెట్టారు. అతను శుక్రవారం ఉదయం తిరిగి విజయవాడ వస్తున్నట్లు గుర్తించారు. నందిగామ వద్ద నిఘా పెట్టి అతడిని అదుపులోకి తీసుకొని రాత్రికి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఇరు పక్షాల పెద్దలు మాట్లాడుకొని వధూవరులకు వివాహం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని