సహకార రంగ బలోపేతమే లక్ష్యం
eenadu telugu news
Published : 23/10/2021 06:17 IST

సహకార రంగ బలోపేతమే లక్ష్యం


హనుమాన్‌జంక్షన్‌లో ఆప్కాబ్‌ శాఖను ప్రారంభిస్తున్న మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే వంశీ, తదితరులు

హనుమాన్‌జంక్షన్‌ (గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: సహకార రంగ బలోపేతమే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పలు నూతన సంస్కరణలను అమలుచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. హనుమాన్‌జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు(ఆప్కాబ్‌) నూతన శాఖను స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్‌తో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీతనం, రైతుకు ఆర్థిక సాయమే ప్రధాన అజెండాగా సహకార బ్యాంకింగ్‌ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటరీకరణ, హెచ్‌ఆర్‌ పాలసీ, పటిష్ఠమైన ఆడిట్‌ విధానంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణి, ఎండీ శ్రీనాథరెడ్డి, బ్యాంకు ఉద్యోగులు, వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

‘దొడ్డిదారి రాజకీయాలు మానుకోవాలి’
హనుమాన్‌జంక్షన్‌(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే:  తెదేపా అధినేత చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే వంశీ పేర్కొన్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో వైకాపా నిర్వహించిన జనాగ్రహ దీక్షలో శుక్రవారం వారు పాల్గొని మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై చంద్రబాబు చేసిన దాడి ఇప్పుడు శాపంగా మారిందని ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేశ్‌కు లేదన్నారు. గన్నవరం గాంధీబొమ్మ కూడలిలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో కూడా నేతలతో కలిసి మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గంగాభవానీ, ఎలిజబెత్‌రాణి, ఎంపీపీలు నగేష్‌, రవి, నేతలు నక్కా గాంధీ, సురేష్‌, గౌసాని, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని