AP News: ఎన్టీఆర్‌ భవన్‌కు మంగళగిరి పోలీసుల నోటీసులు
eenadu telugu news
Published : 23/10/2021 13:34 IST

AP News: ఎన్టీఆర్‌ భవన్‌కు మంగళగిరి పోలీసుల నోటీసులు

మంగళగిరి: మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల కార్యాలయంపై పలువురి దాడి చేసిన నేపథ్యంలో సీసీ టీవీ ఫుటేజ్‌ ఇవ్వాలని పోలీసులు కోరారు. కార్యాలయ ఉద్యోగి బద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా కార్యాలయం రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు ఇచ్చారు. సాయంత్రం 5గంటలలోపు వచ్చి వివరాలు అందివ్వాలని పేర్కొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం గోడకు నోటీసులు అంటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని