వివాదాల కేంద్రంగా పాతాసుపత్రి క్యాంటీన్‌
eenadu telugu news
Published : 24/10/2021 05:13 IST

వివాదాల కేంద్రంగా పాతాసుపత్రి క్యాంటీన్‌

మూసివేయాలని ఆదేశించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి, పాతాసుపత్రి, న్యూస్‌టుడే: విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో వివాదాలకు కేంద్రంగా మారిన క్యాంటీన్‌పై హైకోర్టు తాజాగా తీర్పిచ్చింది. ఈ క్యాంటీన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున మూసివేయాలంటూ ఆదేశించింది. ప్రజాహితం కోసం క్యాంటీన్‌ను నిర్వహించాలంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి కొత్తగా ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. విజయవాడ పాత ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రైవేటు క్యాంటీన్‌పై ఆరంభం నుంచే పలు వివాదాలు వచ్చాయి. దీని నిర్వహణ కోసం లీజుకు ఇచ్చిన స్థలం కంటే అధికంగా వినియోగించుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా దృష్టిసారించి విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్‌ నిర్వహణ కొనసాగుతోందని, దీనికోసం ఆసుపత్రి గోడను సైతం కూల్చివేశారని అప్పటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కె.శివశంకర్‌ సారథ్యంలోని సభ్యులు ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. ఈ నివేదకలో ఎటువంటి కదలిక లేకపోవడంతో, పాతాసుపత్రిలో కూల్చిన గోడ నిర్మాణంలో సైతం జాప్యం జరగడంతో కొంతమంది వ్యక్తులు క్యాంటీన్‌ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా హైకోర్టు తీర్పు విడుదల చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని