జగన్‌ అవగాహన రాహిత్యానికి రాష్ట్రం నాశనం: జీవీ
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

జగన్‌ అవగాహన రాహిత్యానికి రాష్ట్రం నాశనం: జీవీ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ అవగాహన రాహిత్యం, అహంకారానికి రాష్ట్రం సర్వనాశనమవుతుందని నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అనని వ్యాఖ్యలను అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ రౌడీమూకలు విధ్వంసానికి పాల్పడేలా చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జలపై పట్టాభి చేసిన విమర్శలను జగన్‌ను అన్నట్లుగా ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారు. జగన్‌ అమరవీరుల దినోత్సవం రోజున సజ్జల రాసి ఇచ్చిన స్క్రిప్టును చదివారు. రామకృష్ణారెడ్డిని గుడ్డిగా నమ్ముతున్నందుకు జగన్‌ ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్‌ తల్లిని పట్టాభి పన్నెత్తు మాట అనలేదు. జగన్‌ పాలనలో గంజాయి ద్రవ రూపంలో కూడా తయారవుతుంది. తనను ఎవరైనా, ఏదైనా అంటే అభిమానులు రెచ్చిపోతారని జగన్‌ చెప్పడం అరాచకాలను పెంచి పోషించడం కాదా. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుపెట్టుకుని మసలుకోవాలి. జగన్‌ పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయారు. వచ్చేది తెదేపా ప్రభుత్వమే. జగన్‌ సాగిస్తున్న రాక్షస పాలనకు ప్రజలే సమాధి కడతారు’.. అని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని