జీజీహెచ్‌లో త్వరలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

జీజీహెచ్‌లో త్వరలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: పిల్లల్లో ఏ రకం చెముడునైనా అధిగమించే అవకాశం ఉన్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను త్వరలోనే సర్వజనాసుపత్రిలో ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ప్రభావతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. చెవి, ముక్కు, గొంతు విభాగంలో గత రెండు రోజుల నుంచి వినికిడి లోపం ఉన్న 35 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించగా, వీరిలో 16 మందికి శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు నిర్ణయించారన్నారు. అత్యంత ఖరీదైన ఈ శస్త్రచికిత్సలను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మరికొందరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సర్జరీలు చేయనున్నట్లు తెలిపారు. ఇకనుంచి ఈఎన్‌టీ విభాగంలో పసిబిడ్డల్లో వినికిడి లోపం ఉన్నవారిని గుర్తించేందుకు నిత్యం పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. చిన్నవయసులో వినికిడి లోపం వల్ల ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమై, వారి ఉజ్వలమైన భవిష్యత్తు అయోమయంగా తయారవుతోందన్నారు. ఆ లోపాన్ని ముందుగా గుర్తిస్తే చక్కదిద్దేందుకు ఇప్పుడు జీజీహెచ్‌లో అత్యాధునికమైన చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఆచార్య రాజేంద్రప్రసాద్‌, సహాయ ఆచార్యులు సంపత్‌కుమార్‌, అపోలో ఆసుపత్రి వైద్యులు శ్రీరామ్‌, శ్రీకాంత్‌ తదితరులు పిల్లలను పరీక్షించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని