పీఆర్‌ డిప్లొమాఇంజినీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా విభీషణ ఎన్నిక
eenadu telugu news
Published : 25/10/2021 05:27 IST

పీఆర్‌ డిప్లొమాఇంజినీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా విభీషణ ఎన్నిక


సంఘ జిల్లా అధ్యక్షుడు విభీషణ, కార్యవర్గ సభ్యులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఏపీ పంచాయతీరాజ్‌ డిప్లొమా ఇంజినీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిల్లి విభీషణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాపరిషత్తు ప్రాంగణంలోని గుంటూరు డివిజన్‌ పీఆర్‌ ఈఈ కార్యాలయంలో సంఘ ఎన్నికలు ఆదివారం జరిగాయి. రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఎన్నికల పరిశీలకులుగా హాజరయ్యారు. ఆయా పదవులకు ఎన్నికయిన వారి వివరాలను అధ్యక్షుడు విభీషణ ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి.రవీంద్రారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా బి.హెచ్‌.సాంబశివరావు, అసోసియేట్‌ అధ్యక్షుడిగా బి.విజయకుమారి, ఉపాధ్యక్షుడిగా పి.విద్యాసాగర్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆర్‌.సురేంద్ర, సంయుక్త కార్యదర్శిగా టి.వి.సత్యనారాయణ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికయిన పీఆర్‌ డిప్లొమా ఇంజినీర్ల సంఘ కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బండి శ్రీనివాసరావు సూచించారు. సమావేశంలో ఏపీ పీఆర్‌ డిప్లొమా ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామరాజు, రాష్ట్ర నాయకులు ప్రసాద్‌, బి.రత్నప్రసాద్‌, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు సోమేశ్వరరావు, డిప్లొమా ఇంజనీర్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని