విష సంస్కృతిని తిప్పి కొట్టాలి : సురవరం కపిల్‌
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

విష సంస్కృతిని తిప్పి కొట్టాలి : సురవరం కపిల్‌

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : కులం మతం, సంస్కృతి, సంప్రదాయాల పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా, భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థల కుట్రలను ప్రగతిశీల శక్తులు అడ్డుకోవాలని సీపీఐ జాతీయ సామాజిక మాధ్యమ కన్వీనర్‌, విద్యార్థి సమాఖ్య మాజీ నాయకుడు సురవరం కపిల్‌ పిలుపునిచ్చారు. దాసరిభవన్‌లో నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్‌ జాతీయ కార్యశాల ఆదివారం రెండో రోజు కొనసాగింది. ‘సామాజిక మాధ్యమాలు యువత ప్రభావం’పై చర్చించారు. ఈ సందర్భంగా కపిల్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్లు, కులగణన వంటి అంశాలతో పాటు భాష, సంస్కృతి, ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తూ.. మేమే నిజమైన దేశ భక్తులం అనే రీతిలో ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలు చెప్పే వారిపై భౌతిక దాడులు, అక్రమ కేసులు, నిర్బంధించడం దేశ రక్షణకు గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై, కర్ణాటక అధ్యక్షుడు హరీష్‌ బాల, కేరళ నాయకులు దినేష్‌ రంగనాథ, ఏపీ కమిటీ సభ్యుడు పరుచూరి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని