‘దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌ మంజూరు చేయండి’
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

‘దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌ మంజూరు చేయండి’

గాంధీనగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్రంలో దస్తావేజు లేఖరులందరికీ లైసెన్స్‌ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణ మండపంలో నిర్వహించిన దస్తావేజు లేఖరుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం గ్రామ సచివాలయల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో దస్తావేజు లేఖరులను భాగస్వామ్యం చేయాలని కోరారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌ చలానా విధానంలో పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం కల్పించిన నెట్ బ్యాంకింగ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే, ఆర్టీజీఎస్‌లను ఎలా ఉపయోగించాలో తమకూ తెలియజేయాలని కోరారు. చాలానా కుంభకోణంలో తమకు ఆపాదించిన ఆరోపణలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కొందరు చేసిన తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరికాదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి దస్తావేజు లేఖరుల సమస్యలు వివరిస్తామని, తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వేణుగోపాల్‌, కోశాధికారి చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని