నేడు మచిలీపట్నంలో స్పందన
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

నేడు మచిలీపట్నంలో స్పందన

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. జిల్లా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు.

సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో..
విజయవాడ రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్టు సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ తెలిపారు. డివిజన్‌ పరిధిలోని మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలను దాఖలు చేయవచ్చని ఆయన సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని