విద్యుత్తు వినియోగదారులకు ఈ-కేవైసీ
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

విద్యుత్తు వినియోగదారులకు ఈ-కేవైసీ

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ‘సదా మీ సేవలో...’ నినాదంతో రింగ్‌ రోడ్డు సబ్‌స్టేషన్‌ పరిధిలోని వినియోగదారులకు ఈ-కైవేసీ కార్యక్రమాన్ని చేపట్టామని కార్యనిర్వాహక ఇంజినీరు పి.హరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా వినియోగదారులు తమ పూర్తి పేరు(ఆధార్‌లో ఉన్న విధంగా), తండ్రి/భర్త పేరు, ప్రస్తుత సర్వీసు ఉన్న పూర్తి చిరునామా, ఆధార్‌, చరవాణి, పాన్‌ నంబరు వివరాలు ఇంటికి వచ్చే విద్యుత్తు శాఖ సిబ్బందికి అందివ్వాలన్నారు. దీనిపై ఎటువంటి అనుమానాలు ఉన్నా మీ ప్రాంత సహాయక ఇంజినీరు, విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. సిబ్బంది వచ్చిన సమయంలో ఇంట్లో వినియోగదారులు లేకపోతే ఆయా కార్యాలయాల్లో తెలియజేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని