చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

చిత్ర వార్తలు

విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం   నిర్వహించిన 5కే రన్‌ కార్యక్రమాన్ని లా అండ్‌ ఆర్డర్‌  అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని, మందులు వచ్చాయన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజూ వ్యాయామం చేస్తే వ్యాధికి దూరంగా ఉండొచ్చని ఆయన సూచించారు.


సృజన

వీరులపాడు మండలం కొణతలపల్లి సమీపంలో.. ఈత చెట్టు చుట్టూ పక్షులు గూళ్లు పెట్టుకున్న చిత్రమిది. గడ్డిపోచలు, చెట్ల తీగలను  తీసుకొచ్చి ఎంతో నైపుణ్యంతో గూళ్లు తయారు చేసుకున్నాయి.

-ఈనాడు, అమరావతి


సందడి

నున్న సమీపంలోని పోలవరం కాలువలో సమృద్ధిగా నీరు ఉండడంతో పిచ్చుకలు కాలువ వెంబడి విద్యుత్తు తీగలపై ఇలా వరుస కట్టాయి. కిలకిలరావాలతో ఎగిరి, మళ్లీ వచ్చి తీగలపై వాలుతూ సందడి చేశాయి. అటుగా వెళ్లే చూపరుల కళ్లను కట్టి పడేస్తున్నాయి.


రంగు మారింది..

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయకూడదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసింది. అయినా తొలగించకపోవడంతో గత నెలలో కోర్టు చెప్పినా వినరా అంటూ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చోడవరంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి వేసిన పార్టీ రంగులను ఆగమేఘాల మీద ఇటీవల తొలగించి నీలం రంగు మాత్రమే ఉంచారు.

- ఈనాడు, అమరావతి


అవస్థ చూడరూ!

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ లోపలకి వెళ్లేదారిలో వృద్ధుల అవస్థలు..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌కి జిల్లా నలుమూలల నుంచి వచ్చిపోయే వారిలో వృద్ధులు, దివ్యాంగులు, రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బస్టాండ్‌ లోపలికి వెళ్లాలన్నా, బయటికి రావాలన్నా రెండు దారులున్నాయి. ప్రధాన మార్గంలో ఉన్న రహదారిలో మెట్ల మీదుగా వెళ్లడానికి వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మార్గంలో ర్యాంపు నిర్మించి ప్రయాణికులకు సహకరించాలని కోరుతున్నారు.

అనారోగ్యంతో వచ్చే రోగికి తప్పని తిప్పలు...

-ఈనాడు, గుంటూరు  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని