కానిస్టేబుల్‌కు అభినందన
eenadu telugu news
Updated : 25/10/2021 05:52 IST

కానిస్టేబుల్‌కు అభినందన


మురళీకుమార్‌ను సత్కరిస్తున్న డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్సై సుబ్రహ్మణ్యం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల మామను అల్లుడు హత్య చేసిన కేసులో నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన బాపులపాడు మండలం వీరవల్లి పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ ఎం.మురళీకుమార్‌ను డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్సై సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా అభినందించారు. మైలవరం మండలం ఎదురుబీడెంలో కొలుసు కొండలరావు, ఆయన భార్య రమణ, కుమార్తెలు ధనలక్ష్మి, భవానీలపై ఈనెల 18న గన్నవరం మండలం బల్లిపర్రుకు చెందిన వీర్ల రాంబాబు దాడి చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా బాపులపాడు మండలం బండారుగూడెం వద్ద పోలవరం కట్ట సమీపంలో కానిస్టేబుల్‌ ఎం.మురళీకుమార్‌ అతనిని పట్టుకున్నారు. ఉమామహేశ్వరపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో నిందితుడిని పట్టుకోవడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆదేశాల మేరకు మురళీకుమార్‌ను ‘బెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఆఫ్‌ ది వీక్‌’ కింద డీఎస్పీ ఆదివారం ఘనంగా సత్కరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని