అన్ని యూనిట్లు పని చేస్తున్నా.. ఉత్పాదన అంతంతే
eenadu telugu news
Published : 25/10/2021 05:51 IST

అన్ని యూనిట్లు పని చేస్తున్నా.. ఉత్పాదన అంతంతే


ఎన్టీటీపీఎస్‌ కోల్‌ యార్డులో నిండుకున్న బొగ్గు నిల్వలు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఎన్టీటీపీఎస్‌ నాలుగు దశల్లో ఏడు యూనిట్లు ఉత్పాదన చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల మొదటి వారంలో మరమ్మతులకు గురైన యూనిట్లు తిరిగి ఉత్పాదనలోకి రెండు రోజుల క్రితం తీసుకొచ్చారు. అన్ని యూనిట్లు నిరంతరాయంగా ఉత్పాదన చేయడానికి సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవడం గమనార్హం. నాలుగు దశల్లోని ఏడు యూనిట్లలో 1,760 మెగావాట్ల ఉత్పాదన రావాల్సి ఉండగా ఆదివారం 1,279 మెగావాట్ల ఉత్పాదన మాత్రమే జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు నిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఉత్పాదనలో మెరుగుదల ఉంటుందని వారు వివరిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని