ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం
eenadu telugu news
Updated : 25/10/2021 16:06 IST

ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. తాను తయారు చేసే కంటి చుక్కల మందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో ఆనందయ్య రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆ దరఖాస్తును వెంటనే పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపి దరఖాస్తు తిరస్కరించొద్దని స్పష్టం చేసింది. కాగా, తమకు దరఖాస్తు చేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా దరఖాస్తు, ప్రభుత్వ జవాబును ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఆనందయ్య కంటి చుక్కల మందుతో ప్రమాదం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. కరోనా వల్ల ప్రభుత్వాసుపత్రిలో ఎందరు మరణించారని ప్రశ్నించింది. ఆనందయ్య మందు వల్ల ఎంతమంది మరణించారు అని అడిగింది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని