దీపావళికి ప్రత్యేక రైలు
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

దీపావళికి ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: దీపావళి పండగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదగా పూర్ణ-తిరుపతి మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07607 ప్రత్యేక రైలు నవంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో పూర్ణలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నంబరు 07608 నవంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో తిరుపతిలో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.25 గంటలకు పూర్ణ చేరుతుంది. ఈ రైలు నాందెడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి స్టేషన్లలో ఆగుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని