చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

చిత్ర వార్తలు

నిర్లక్ష్యపు దారి

రామవరప్పాడు రింగ్‌ నుంచి రమేష్‌ ఆసుపత్రి కూడలి వరకు జాతీయ రహదారి, సర్వీసురోడ్డుకు మధ్యలో ఒకప్పుడు అందమైన పచ్చని చెట్ల మధ్య నడకదారి ఇది. నేడు నిర్వహణ సరిగా లేక ఎక్కడ చూసినా పాముల పుట్టలు, వ్యర్థాలు, విరిగిపోయిన ఇనుప కంచె కనిపిస్తున్నాయి. అలంకరణ కోసం ఏర్పాటుచేసిన విద్యుత్తు బల్బులన్నీ నేడు మాయం అయ్యాయి. దీంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో నడక కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి దారిని సుందరంగా తీర్చి దిద్దాలని కోరుతున్నారు.

- ఈనాడు అమరావతి


నిబంధనలు పాటించకుంటే ఎలా...?

గుంటూరు జీజీహెచ్‌ ప్రసూతి విభాగం వద్ద వేచి ఉంటున్న రోగుల బంధువులు

గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో  ఏ విభాగం చూసినా రద్దీ విపరీతంగా ఉంటోంది.  భౌతిక దూరం ఎక్కడా  పాటించడం లేదు.  కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. కరోనా మహమ్మారి భయం కాస్త తగ్గినప్పటికీ, ముప్పు ఇంకా తొలగలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాల్సిన అవసరముంది.

ఎముకలు, కీళ్ల విభాగం వద్ద ఇలా..

- ఈనాడు గుంటూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని