అమరావతి పరిరక్షణ పాదయాత్రకు మద్దతు
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

అమరావతి పరిరక్షణ పాదయాత్రకు మద్దతు


కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి మొక్క ఇస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకుడు సత్యనారాయణ

తుళ్ళూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి పరిరక్షణకు కర్షకులు, రైతు కూలీలు వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర హైకోర్టు నుంచి తితిదే వరకు తలపెట్టిన పాదయాత్రకు వివిధ రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. 45 రోజుల పాటు కొనసాగే మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి హాజరై మద్దతు ఇస్తారని రాజధాని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ప్రతినిధి కొమ్మినేని సత్యనారాయణ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆమెను తన నివాసంలో కలుసుకొని కార్యక్రమానికి ఆహ్వానించినట్లు న్యూస్‌టుడేకు తెలిపారు. సీబీఐ మాజీ డైరెక్టరు జేడీ లక్ష్మీనారాయణ 28న రాజధాని ప్రాంతంలో రైతులు కొనసాగిస్తున్న నిరసన దీక్షల శిబిరాలను సందర్శిస్తారని చెప్పారు. రాజధానిగా అమరావతి ఎంతో అభివృద్ధి సాధిస్తుందనుకుంటున్న తరుణంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నేలపాలు చేసిందని, తాను ఎంతో బాధపడుతున్నట్లు రేణుకాచౌదరి తెలిపారని ఆయన వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని