‘చంద్రబాబు దిల్లీ వెళ్తే వారికి భయమెందుకు?’
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

‘చంద్రబాబు దిల్లీ వెళ్తే వారికి భయమెందుకు?’


నసీర్‌ను సత్కరిస్తున్న గాలి సతీష్‌

పట్టాభిపురం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దిల్లీ వెళ్తే సీఎం జగన్‌ గ్యాంగుకు అంత భయం ఎందుకని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌ ప్రశ్నించారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన గాలి సతీష్‌ తదితరులు నసీర్‌ను సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. అల్లరి మూకలు రెచ్చిపోయి ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను, నేతల ఇళ్లను ధ్వంసం  చేస్తుంటే రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తే తప్పేంటి. పొరుగు రాష్ట్రాల పోలీసులు ఏపీలోకి వచ్చి గిరిజనులపై కాల్పులు జరిపినప్పుడే రాష్ట్రం పరువు గంగలో కలిసింది. దాడి ఎలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆధారాలు సేకరించడానికి కూడా పోలీసులు తెదేపా కార్యాలయానికి రాలేదు. దాడి జరిగినప్పుడు పట్టుబడ్డ వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే ఆయన తెదేపా నేతల పైనే కేసు పెట్టారు. లోకేష్‌ ఆరోజు రాత్రి 8.30 గంటలకు కార్యాలయానికి వస్తే.. సాయంత్రం 6.00 గంటలకు దాడి చేశారని, తిట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు.   డ్రగ్స్‌ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టం’.. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్లావుల అశోక్‌, జాదా, ఆరాధ్యుల వెంకటరమణ, వేములకొండ శ్రీనివాస్‌, హాఫీజ్‌, జబి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని