పురస్కారాల ప్రదానానికి అన్ని ఏర్పాట్లు
eenadu telugu news
Updated : 26/10/2021 06:19 IST

పురస్కారాల ప్రదానానికి అన్ని ఏర్పాట్లు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలను నవంబరు ఒకటో తేదీన ప్రదానం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ తెలియజేేశారు. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ సోమవారం  కలెక్టర్లతో నిర్వహించిన వీసీకి కలెక్టర్‌తో పాటు జేసీ మాధవీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ విభాగంలో కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం,  జర్నలిజంలో ఏబీకే ప్రసాద్‌, వ్యవసాయ అనుబంధ రంగాల విభాగంలో తోట్లవల్లూరు మండలం చాగంటిపాడుకు చెందిన కొల్లి కేశవ చంద్రమోహనరెడ్డి, కంచికచర్ల మండలం పెరకలపాడుకు చెందిన వల్లూరు రవికుమార్‌, ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ విభాగంలో కొండపల్లి బొమ్మలకు సంబంధించి కూరెళ్ల వెంకటాచారి, డప్పు కళాకారుడు మైలవరం మండలం వెల్వడంకు చెందిన  జి.గాలేబు, వైద్యారోగ్య విభాగంలో విజయవాడ జీజీహెచ్‌ స్టాఫ్‌నర్స్‌ పి.లక్ష్మిలను వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలకు ప్రభుత్వం ఎంపికచేసిందని చెప్పారు. నవంబరు ఒకటో తేదీన విజయవాడలో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని