‘ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం’
eenadu telugu news
Published : 26/10/2021 04:26 IST

‘ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం’

చెత్త కుప్పలను పరిశీలిస్తున్న బాబూరావు, నాయకులు

అజిత్‌సింగ్‌నగర్‌ : ప్రజారోగ్యంతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు అన్నారు. సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ప్లాంటు ఆవరణలో పేరుకుపోయిన చెత్త నిల్వలను సోమవారం ఆయన పార్టీ నాయకుల బృందంతో కలసి పరిశీలించారు. స్థానికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ అని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు.. లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతంలో చెత్త వేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌, పాయకాపురంలో నివసించేది పేదలేనని ఈ సమస్యను పరిష్కరించడం లేదా అని ప్రశ్నించారు. చెత్త యార్డుకు పక్కనే జీ ప్లస్‌ త్రీ ఇళ్లు నిర్మించి, పేదలకు ఇచ్చారని వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు, మేయరు, కార్పొరేటర్లు వెంటనే స్పందించాలని, చెత్తనంతా దూర ప్రాంతాలకు తరలించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఎం నగర నాయకులు బి.రమణారావు, సి.హెచ్‌.శ్రీనివాస్‌, నిజాముద్దీన్‌, పీరూ, పాల కేశవ, పీఎస్‌ఎన్‌ మూర్తి, నరసింహారావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని