సీఎన్‌జీ అమ్మకాల్లో ప్రథమ స్థానం
eenadu telugu news
Published : 26/10/2021 04:32 IST

సీఎన్‌జీ అమ్మకాల్లో ప్రథమ స్థానం


సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేస్తున్న జైళ్ల శాఖ డీజీ హసన్‌రెజ

గాంధీనగర్‌, న్యూస్‌టుడే : సీఎన్‌జీ అమ్మకాల్లో దక్షిణ భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని జైళ్ల శాఖ డీజీ ఎం.డి.హసన్‌రెజ అన్నారు. గాంధీనగర్‌ జిల్లా కారాగారం హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకు వద్ద సోమవారం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాల్లో శాఖ బంక్‌ మొదటి ఐదు స్థానాల్లో నిలిపిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. పనిలో ప్రతిభచూపిన సిబ్బందికి స్వీట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉత్తమ వినియోగాదరులను జ్ఞాపికలతో సత్కరించారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు తిరిగి సమాజంలో గౌరవంగా జీవించేలా, వారికి ఆర్థిక చేయూతనివ్వడానికి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగర ప్రజలు తమ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు, కారాగార పర్యవేక్షిణాధికారి కె.రఘు, జైలర్లు జి.రవిబాబు, గణేష్‌, డిప్యూటీ జైలర్‌ వేణు, హెచ్‌పీసీఎల్‌ చీఫ్‌ మేనేజర్‌, కారాగార సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని