మోసం చేసి పెళ్లి!
eenadu telugu news
Published : 26/10/2021 06:31 IST

మోసం చేసి పెళ్లి!

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే:  తనను మోసం చేసి పెళ్లి చేశారని ఓ యువకుడు సోమవారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. బాధితుడు విలేకరులకు తెలిపిన వివరాల మేరకు ‘నేను ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాను. మా తల్లిదండ్రులకు తెలిసిన వారు రెండేళ్ల కిందట వివాహం కుదిర్చి పెద్దల సమక్షంలో వైభవంగా వివాహం చేశారు. రెండేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాను. వైద్యులు పరీక్షించి  ఆమెకు పురుష లక్షణాలు ఉన్నాయని, 12 ఏళ్ల వయసులో శస్త్ర చికిత్స చేయించి ఆ అవయవాలు తొలగించి ఉంటారని చెప్పారు. దీంతో పిల్లలు కలిగే అవకాశం ఉండదన్నారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టులను ఆమె తల్లిదండ్రులకు పంపాను. వారు నాపై దాడికి వచ్చారు. చంపుతామని, ఆమెతోనే ఉండాలని బెదిరించారు. న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరాను’.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని