అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
eenadu telugu news
Published : 27/10/2021 03:42 IST

అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు

పెనమలూరు, న్యూస్‌టుడే: గ్యాంగ్‌వార్‌ కేసుల్లో నిందితులను  నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తీవ్రంగా హెచ్చరించారు. కొంతకాలం క్రితం పటమట తోటవారివీధిలో గ్యాంగ్‌వార్‌ జరగ్గా పండు, జగదీష్‌ వర్గాలకు చెందిన 57 మంది యువకులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పెనమలూరు, పటమట, మాచవరం, మంగళగిరి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నివసించే వారందరినీ పెనమలూరు సీఐ సత్యనారాయణ అదుపులోకి తీసుకొని మంగళవారం సీపీ ఎదుట హాజరుపర్చారు. నిందితులపై పోలీస్‌ నిఘా ఉంటుందని, ఏ మాత్రం అలజడులు రేపినా, అనుమానాస్పదంగా కదలికలున్నా నగర బహిష్కరణతో పాటు పోలీస్‌ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు, దాడుల్లో ప్రమేయం ఉన్నట్లు తేలితే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయంటూ కౌన్సెలింగ్‌ నిర్వహించి హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని