జిల్లా రైతులకు రూ.67.92 కోట్ల జమ
eenadu telugu news
Published : 27/10/2021 03:42 IST

జిల్లా రైతులకు రూ.67.92 కోట్ల జమ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఈ ఏడాది వై.ఎస్‌.ఆర్‌. రైతు భరోసా రెండో విడత కింద 3,13,195 మంది రైతులకు ప్రభుత్వం.. పెట్టుబడి సాయం కింద రూ.67.92 కోట్లు విడుదల చేసినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. వై.ఎస్‌.ఆర్‌. సున్నా వడ్డీ పథకం కింద రూ.5.51 కోట్లు, యంత్ర సేవా పథకం కింద రూ.1.76 కోట్లు జమ చేసినట్టు వివరించారు. మొదటి విడతలో 3,26,326 మంది రైతులకు రూ.244.74 కోట్లు జమ చేసినట్టు ఆయన గుర్తు చేశారు. రైతు భరోసా తదితరాల కింద నిధులను తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీసీ ద్వారా మంగళవారం విడుదల చేశారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్సీ కరీమున్సీసా, మేయర్‌ భాగ్యలక్ష్మి, ఉప మేయర్లు ఎ.శైలజారెడ్డి, బెల్లం దుర్గ, జేసీ కె.మాధవీలత, జిల్లా వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షుడు జన్ను రాఘవరావు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని