యోగాతో శారీరక దృఢత్వం
eenadu telugu news
Published : 27/10/2021 03:42 IST

యోగాతో శారీరక దృఢత్వం

ఆకట్టుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రతినిధుల యోగాసనాలు

కొండపావులూరు(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: యోగాతోనే మానసి, శారీర దృఢత్వం పెంపొందించుకోవచ్చని ఎన్డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ జాహిద్‌ఖాన్‌ అన్నారు. మంగళవారం మండలం కొండపావులూరులోని బెటాలియన్‌ ప్రాంగణంలో అంతర్‌ యోగా పోటీలు నిర్వహించారు. సౌత్‌, సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పోటీల్లో ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీకి చెందిన ఎన్డీఆర్‌ఎఫ్‌ 3, 4, 5, 10వ బెటాలియన్‌ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు విభాగాల్లో నిర్వహించిన యోగాసన పోటీల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రతినిధులు వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. పీఆర్‌వో సతీష్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని