గోరఖ్‌పూర్‌-ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైలు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

గోరఖ్‌పూర్‌-ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైలు

రైల్వేస్టేషన్‌(విజయవాడ): ప్రయాణికుల సౌకర్యార్థం గోరఖ్‌పూర్‌-ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. * రైలు నంబరు 05303 ఈ నెల 30, నవంబరు 6, 13 తేదీల్లో శనివారాల్లో గోరఖ్‌పూర్‌లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు నంబరు 05304 నవంబరు 1, 8, 15 తేదీల్లో సోమవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 8.40 గంటలకు గోరఖ్‌పూర్‌ చేరుతుంది. రైలు ఖలీలాబాద్‌, బాస్తి, గోండ, కాన్పూర్‌, ఝాన్సి, భోపాల్‌, ఇటార్సి, నాగ్‌పూర్‌, బలార్షా, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్‌, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, త్రిపూర్‌, కోయంబత్తూర్‌, అలువా స్టేషన్లలో ఆగుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని