ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

శివరామ కృష్ణ (పాతచిత్రం)

బలుసులపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే : కుటుంబ కలహాల నేపథ్యంలో ఆర్మీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెరుకుపల్లి ఎస్సై డి.వి.కొండారెడ్డి కథనం ప్రకారం.. బలుసులపాలెం పంచాయతీ పరిధి మెట్టగౌడవారిపాలేనికి చెందిన దాసరి వెంకటశివరామకృష్ణ(30) 2015లో ఆర్మీలో సిపాయిగా చేరాడు. 2017లో వివాహమైంది. సికింద్రాబాద్‌లో పనిచేస్తున్న అతడు ఈ నెల 7న సెలవులపై ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి భార్య సునీతతో గొడవ జరిగింది. మంగళవారం ఉదయం తల్లి కుమారుడ్ని నిద్ర లేపుదామని గదికి వెళ్లగా, ఫ్యాన్‌కి ఉరేసుకుని వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. ఆమె కేకలు వేయగా, కుటుంబ సభ్యులు వచ్చి వెంకటశివరామృకష్ణ మృతదేహాన్ని కిందికి దించారు. మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


వేరు కాపురానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని...

చుండూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు వేరు కాపురం వద్దన్నారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని వలివేరుకు చెందిన ఎం.శివశంకర్‌(23)కు, కొల్లిపరకు చెందిన దుర్గాభవానీతో మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే ఈ యువకుడు కొద్దిరోజుల నుంచి తాము వేరు కాపురం పెట్టుకుంటామని, అందుకు అనుమతించాలంటూ తల్లిదండ్రులను కోరుతూ వచ్చారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో తీవ్ర వ్యధకు గురైన ఈయన సోమవారం రాత్రి మద్యం తాగి, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివశంకర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రోశయ్య చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని