చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

చిత్ర వార్తలు

లేఔట్‌ ఇలా.. నిర్మాణాలెలా..!?

లేఔట్‌లోకి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి

గుడివాడ మల్లాయపాలెం కొత్త లేఔట్‌లో పట్టణానికి చెందిన 5,594 మంది పేదలకు ఈ ఏడాది జనవరిలో ఇళ్ల పట్టాలు అందజేశారు. జులై 2, 3, 4 తేదీల్లో తొలి విడతగా ఇందులో 1,260 మంది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. రహదారి లేక ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. సగం ప్రాంతంలో కూడా నీటి ట్యాంకులు ఏర్పాటు చేయలేదు. ఈ లేఔట్‌కు వెళ్లే దారి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా ఉంది. లేఔట్‌లో ఇప్పటికీ గుంతుల్లో నీరు నిలిచి ఉంది. ఇక్కడ నిర్మాణాలెలా చేపట్టాలని లబ్ధిదారులు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, గుడివాడ


ఈ చిన్నోడు.. పెద్ద పనోడు

చిత్రంలో కనిపిస్తున్న హెలికాప్టర్‌ బరువు 18.5 గ్రాములు. దీని విలువ రూ. కోటి. దీన్ని మన రాష్ట్ర ఆక్టోపస్‌ పోలీసులు వాడుతున్నారు. ఈ నానో హెలీకాప్టర్‌.. వాన, మెరుపులు, రాత్రి సమయంలో కూడా.. 30 నిమిషాలపాటు ఆకాశంలో ఎగురుతూ పని చేయగలదు. ఉగ్రవాదులు, మావోయిస్టులు ఎక్కడ దాక్కున్నారో కనిపెట్టి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించగల సామర్థ్యం దీని సొంతం. జీపీఎస్‌ సాయంతో ఇది నడుస్తుంది. హెలీకాప్టర్‌కు అమర్చిన కెమెరాల ద్వారా చిత్రాలను పోలీసులకు అందించి.. తద్వారా సంఘ విద్రోహ శక్తుల ఆచూకీ కనిపెట్టడానికి ఉపయోగపడుతోంది. పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విజయవాడ పోలీసు మైదానంలో ఏర్పాటు చేసిన పోలీసు ఓపెన్‌హౌస్‌ ప్రదర్శనలో దీనిని ప్రదర్శించారు.

- ఈనాడు, అమరావతి


పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు. వాటి గురించి వివరిస్తున్న పోలీసులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని