Ap News: రేపు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ
eenadu telugu news
Published : 27/10/2021 22:10 IST

Ap News: రేపు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సహా నేతలపై వైకాపా శ్రేణుల దాడులపై రాష్ట్రపతికి ప్రతిపక్షనేత చంద్రబాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అరాచకపాలన జరుగుతోందని 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి సహా ఇతర అంశాలపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడులకు దారితీసిన పరిస్థితులను గవర్నర్‌కు సీఎం వివరించనున్నట్లు సమాచారం. దాడులకు ముందు తెదేపా నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీలు, ఇతర ఆధారాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నందున.. సభ నిర్వహణపైనా గవర్నర్‌తో చర్చించే అవకాశాలున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని