అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే : పంటల సాగులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం లేక గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామకు చెందిన కౌలురైతు కంచర్ల నాగేశ్వరరావు(40 బుధవారం బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగేశ్వరరావు మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని ఏటా పత్తి, మిరప పైర్లను పండించేవారు. వ్యవసాయం కలిసి రాక ఏటా పెట్టుబడులు దక్కేవికావు. దీంతో సుమారు రూ.6.5 లక్షల అప్పులు మిగిలాయి. అప్పు తీర్చే దారి లేక తీవ్ర మానసిక వేదనకు గురైన నాగేశ్వరరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు గ్రామీణ ఎస్సై ఆవుల బాలకృష్ణ కేసు నమోదు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని