కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు
eenadu telugu news
Published : 28/10/2021 02:47 IST

కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేటలో వైఎస్సార్‌ కూరగాయల మార్కెట్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి తొలిదశ కింద రూ.10కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అంచనాలు తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు నుంచి విజయవాడ వెళుతూ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే విడదల రజిని ఇంటి వద్దకు వచ్చారు. ఎమ్మెల్యేతోపాటు పురపాలక ఛైర్మన్‌ షేక్‌ రఫాని, కమిషనర్‌ రవీంద్ర, అధికారులతో పురపాలక అభివృద్ధిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. పట్టణానికి మంచినీటి సమస్య దశాబ్దాలుగా ఉందని, ట్యాంకర్ల ద్వారా చాలా ప్రాంతాలకు మంచినీటిని అందించాల్సి వస్తుందని, బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

నెలాఖరుకు బిల్లులు: మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో చేసిన అన్ని పనులకు సంబంధించి బిల్లులు ఈనెలాఖరులోగా చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. త్వరలోనే అన్ని బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. అమృత్‌ పథకం ద్వారా జరుగుతున్న పనులను వెంటనే పూర్తయ్యేలా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ మద్దిరాల విశ్వనాథం, పురపాలక వైస్‌ఛైర్మన్‌ కొలిశెట్టి శ్రీనివాసరావు, నాదెండ్ల జడ్పీటీసీ సభ్యుడు కాట్రగడ్డ మస్తాన్‌రావు, కొమరవల్లిపాడు సొసైటీ అధ్యక్షుడు తోట బ్రహ్మస్వాములు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని