అవార్డుల ప్రదానోత్సవానికి పక్కా ఏర్పాట్లు
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

అవార్డుల ప్రదానోత్సవానికి పక్కా ఏర్పాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడలోని ఎ1 కన్వెన్షన్‌ హాలులో నవంబరు ఒకటో తేదీన వై.ఎస్‌.ఆర్‌. జీవిత సాఫల్య అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అవార్డు గ్రహీతలతో గౌరవ, మర్యాదలతో మెలగాలని, ఎలాంటి లోటు పాట్లు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. నగరంలోని విడిది కార్యాలయంలో ఏర్పాట్ల విషయమై బుధవారం సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అతిథి మర్యాదల బాధ్యత లైజనింగ్‌ అధికారులదేనన్నారు. అవార్డు గ్రహీతలు ఆ రోజు నగరానికి చేరుకున్న వెంటనే వారికి కేటాయించిన హోటల్‌ వద్ద వేచి ఉండే పరిస్థితి లేకుండా సత్వరమే గదుల వద్దకు తోడ్కొని వెళ్లాలన్నారు. వేదిక వద్ద ఏర్పాట్లు, విద్యుత్తు తదితర సౌకర్యాల పరంగా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని సూచించారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ముఖ్యమంత్రితో గ్రూప్‌ ఫొటో దిగే కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 29న ఎ1 కన్వెన్షన్‌ హాలును పరిశీలించి, మరో సారి సమన్వయం చేయనున్నట్టు తెలిపారు. వాహనాల కేటాయింపు, పార్కింగ్‌ సౌకర్యాలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సమీక్షలో జేసీలు కె.మాధవీలత, మోహన్‌కుమార్‌, వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, రవాణా శాఖ ఉప కమిషనర్‌ పురేంద్ర, జడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌, మచిలీపట్నం, నూజివీడు ఆర్డీవోలు ఖాజావలి, కె.రాజ్యలక్ష్మి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు జె.సునీత, జీవీ సూర్యనారాయణ, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల డీడీలు కె.సరస్వతి, లక్ష్మీదుర్గ తదితరులు పాల్గొన్నారు.

వారంలో అప్రోచ్‌ రోడ్ల పనులు పూర్తి

జి.కొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని వెలగలేరు, హెచ్‌.ముత్యాలంపాడులోని లేఔట్లకు వెళ్లే అప్రోచ్‌ రోడ్ల పనులను వారంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని లేఔట్లను బుధవారం ఆయన సందర్శించి, పనులపై ఆరా తీశారు. లేఔట్లు బుడమేరు పక్కనే ఉన్నందున రోడ్డు దెబ్బతిన్నాయని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారులతో త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా అవగాహన కల్పించాలని ఎంపీడీవో అనురాధ, తహశీల్దార్‌ ఇంతియాజ్‌పాషా, గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. హెచ్‌.ముత్యాలంపాడులో విజయవాడ గ్రామీణ లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. వీఎంసీ పరిధిలోని సుమారు 9 వేల మందికి స్థలాలు కేటాయించామని, వారితో త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని