అడవిలో భక్తుల వాహనం దగ్ధం
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

అడవిలో భక్తుల వాహనం దగ్ధం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం శివారు అడవిలోని గుబ్బల మంగమ్మ గుడికి 3 కి.మీ. ఇవతల బుధవారం భక్తులతో వెళ్తున్న టెంపో వ్యాన్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దగ్ధమైంది. భక్తులు గమనించి అప్రమత్తమై వ్యాన్‌ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వ్యానులో మొత్తం 20 మంది ఉన్నారు. విజయవాడ నుంచి 3 టాటా మేజిక్‌ వ్యాన్లు, ఒక కారు, మరో టెంపో వ్యానులో భక్తులు బుధవారం అమ్మ వారి దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటుచేసుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని