close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

బీటీపీకి కృష్ణా జలాలు

● మూడు రోజుల్లోగా అనుమతులు

● ‘ఈనాడు’ కథనానికి స్పందించిన ఎమ్మెల్యేలు ●

సీఎంను కలిసిన కాపు, ఉషా

సీఎంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కాపు, ఉషా

రాయదుర్గం, న్యూస్‌టుడే : రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల వర ప్రసాధినిగా ఉంటూ ప్రస్తుతం బీటలు వారుతున్న బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాల మళ్లింపు పథకానికి మూడు రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తామని సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్ల్లు ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ నెల 12న ‘ఈనాడు’లో ‘పేరూరుకు సై.. బీటీపీకి నై’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాయదుర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఉషా స్పందించారు. బీటీపీకి కృష్ణా జలాల మళ్లింపు పథకం మంజూరుకు సీఎంను కలవటానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అమరావతికి వెళ్లారు. మంగళవారం గుడివాడలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి పండగ సంబరాల్లో పాల్లొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి బీటీపీకి కృష్ణా జలాల మళ్లింపు పథకం మంజూరుకు విజ్ఞప్తి చేశారు. బీటీపీకి కృష్ణా జలాల మళ్లింపు పథకంపై పరిశీలన చేయమని అధికారులను ఆదేశించామని, మరో మూడు రోజుల్లో తప్పక అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.