Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘స్వానిధి’లో ప్రథమం

వీసీలో పాల్గొన్న కమిషనర్‌ మూర్తి తదితరులు

అనంత నగరపాలిక: వీధి విక్రయదారులకు స్వానిధి పథకం అమలులో అనంత నగరపాలకసంస్థ ప్రథమస్థానంలో నిలిచింది. కేంద్రప్రభుత్వ సహాయ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, నగరపాలక కార్యదర్శి సంగం శ్రీనివాసులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయ కార్యదర్శి మాట్లాడుతూ వీధి విక్రయదారులకు సామాజిక భద్రతతోపాటు రుణాలు ఇప్పించి, అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతలో 1985 మందికి రుణాలు ఇచ్చారన్నారు. మొత్తం 125 పురపాలక సంఘాల్లో ఈ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో అనంత నగరపాలక సంస్థ ప్రథమ స్థానం సాధించినందుకు ఆయన అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని