Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళాశాలలను తీర్చిదిద్దాలి

అవగాహన కల్పిస్తున్న రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మారావు

జేఎన్‌టీయూ: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) స్థాయికి తీర్చిదిద్దాలని ఆర్జేడీ పద్మారావు పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అనంతపురం, కర్నూలు జిల్లాల కళాశాలల ప్రధానాచార్యులు, ఆయా విభాగాల అధిపతులకు ఎన్‌బీఏపై అవగాహన కల్పించారు. ప్రతి కళాశాల ఎన్‌బీఏ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. అందుబాటులోని వనరులను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐటీ టీఆర్‌ నాగేంద్రరావు, జాయింట్‌ సెక్రటరీ నారాయణ, సెక్రటరీ విజయభాస్కర్‌, ప్రధానాచార్యులు జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని