Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాత పింఛన్‌ అమలులో జాప్యం

ప్రసంగిస్తున్న రమణారెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారే తప్ప, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయకుండా యాజమాన్యం జాప్యం చేస్తోందని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాత పింఛన్‌ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గురువారం సాయి ఆరామంలో ఎన్‌ఎంయూ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని కోరారు. కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన 6 వేల మంది కార్మికులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, 92 మంది మృతి చెందారని, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తు కార్యచరణపై తీర్మాణాలు చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీరావు, శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముద్దపాటి లక్ష్మీనారాయణ, భాస్కర్‌నాయుడు, చెన్నారెడ్డి, షబ్బీర్‌, నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని