Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముగిసిన సాఫ్ట్‌బాల్‌ శిక్షణ

దుస్తులు అందజేస్తున్న ఆర్డీటీ మేనేజరు సురేంద్ర

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా సాఫ్ట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా జట్లు విజయఢంకా మోగించాలని ఆర్డీటీ మేనేజరు సురేంద్ర పిలుపునిచ్చారు. వారం రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ జట్లకు నిర్వహించిన శిక్షణ శిబిరాలు గురువారం ముగిశాయి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు దుస్తులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లా ఆతిథ్యం ఇస్తోందన్నారు. సాఫ్ట్‌బాల్‌ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కరోనా కారణంగా పోటీలు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కేశవమూర్తి, రామకృష్ణ, లతాదేవి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెండు జట్లకు దుస్తులు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని