Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేవరకొండకు నిప్పు

కొండలో చెలరేగిన మంటలు

బుక్కరాయసముద్రం: చరిత్ర కలిగిన దేరకొండకు దుండగులు నిప్పుపెట్టడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. వెంకటరమణస్వామి వెలసిన దేవరకొండను భక్తులు అత్యంత పవిత్రమైనదిగా పూజిస్తారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వాహనాలు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో సిబ్బంది అతికష్టంమీద 10 గంటలకు మంటల్ని అదుపుచేశారు. బుక్కరాయసముద్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని