Published : 26/02/2021 05:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రాక్టర్‌ ట్రాలీ టైరు తగిలి మహిళ దుర్మరణం

ప్రమాదానికి కారణమైన వాహనం

బుక్కరాయసముద్రం: మృత్యువు ఏ రూపంలోనైనా దూసు కొస్తుందనేందుకు ఇదో ఉదాహరణ. ఇంటి ముందు కూర్చుని ఉన్న మహిళ దుర్మరణం పాలైంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని నీలంపల్లికి చెందిన నాగరత్నమ్మ(48) గురువారం సాయంత్రం ఇంటిముందు కూర్చుని ఉంది. అదే సమయంలో ఆ మార్గంలో బండరాళ్లు తీసుకెళుతున్న ట్రాక్టర్‌ ట్రాలీ టైరు విడిపోయి ఆమె తలకు బలంగా తాకింది. అపస్మారకస్థితికి చేరుకోవటంతో స్థానికులు, బంధువులు అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో కలిసి కూలీ పనులకు వెళుతుంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని