పోలీసులకు  ప్రత్యేక కొవిడ్‌ యాప్‌ 
logo
Published : 24/06/2021 06:29 IST

పోలీసులకు  ప్రత్యేక కొవిడ్‌ యాప్‌ 


యాప్‌ను ఆవిష్కరిస్తున్న డీఐజీ కాంతిరాణాటాటా

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: కరోనా వేళ పోలీసులకు ఉపయోగపడే కొవిడ్‌ ట్రాకర్‌ యాప్‌ను అనంతపురం రేంజి డీఐజీ కాంతిరాణాటాటా ఆవిష్కరించారు. అనంతపురం, చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ఈ యాప్‌ దోహదపడుతుందన్నారు. యాప్‌ వివరాలను డీఐజీ వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన తక్షణమే కొవిడ్‌ ట్రాకర్‌ యాప్‌లో వ్యక్తి వివరాలు, ఆరోగ్య పరిస్థితులు పొందుపరచాలి. పాజిటివ్‌ నిర్ధారణ కాగానే సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ద్వారా మొబైల్‌లో కొవిడ్‌ ట్రాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వైద్యుడి వివరాలు, వాడుతున్న మందులు, తదితరాలు అందులో పొందుపరచాలి. బ్లాక్‌ ఫంగస్‌ గురించి ఈ యాప్‌ అలర్ట్‌ చేస్తుంది. యాప్‌ను రూపొందించడంలో సహకారమందించిన మణికంఠను డీఐజీ కాంతిరాణాటాటా అభినందించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని