పాలిసెట్‌లో అనంత విద్యార్థుల ప్రతిభ
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

పాలిసెట్‌లో అనంత విద్యార్థుల ప్రతిభ

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. జిల్లాలో 6,677 మంది విద్యార్థులు పాలిసెట్‌ పరీక్షకు హాజరయ్యారు. అందులో 6,230 మంది అర్హత సాధించారు. 93 శాతం ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో ఉత్తీర్ణత శాతంలో మన జిల్లా మూడో స్థానంలో ఉంది. జిల్లాలో గుంతకల్లుకు చెందిన వంశీకృష్ణ 14వ ర్యాంకు, సురేష్‌(సిద్దరాంపురం) 39, గుణశేఖర్‌(ధర్మవరం) 54వ ర్యాంకులు సాధించారు. జిల్లాలో 10 ప్రభుత్వ, 8 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలున్నాయి. 1,823 ప్రభుత్వ, 948 ప్రైవేటు సీట్లున్నాయి. కౌన్సెలింగ్‌ తేదీలను 20 తరువాత ప్రకటిస్తామని జిల్లా పాలిసెట్‌ నోడల్‌ అధికారి జయచంద్రారెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని